Breaking News

కేంద్ర ఐటీ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల


కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-MeitY యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 25 ఖాళీలున్నాయి. నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇవి మూడేళ్ల లోపు కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. నెలకు రూ.60,000 స్టైపెండ్ లభిస్తుంది. పలు అంశాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 30 చివరి తేదీ. అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.meity.gov.in/ లేదా https://negd.gov.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్ లింక్ నోటిఫికేషన్‌లోనే ఉంటుంది. https://www.meity.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయొచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని చివరి తేదీ లోగా negdadmin@digitalindia.gov.in మెయిల్ ఐడీకి పంపించాలి.