Breaking News

గుజరాత్ లో దారుణం ..


సూరత్‌ : గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో థాయ్‌లాండ్‌ మహిళ నిప్పంటుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మాగ్డల్లా ప్రాంతంలోని ఫ్లాట్‌లో కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని మిమ్మీగా గుర్తించారు. శనివారం రాత్రి రెండో అంతస్తులోని ఆమె ఫ్లాట్ నుంచి మంటలు రావడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంటి తలుపులు లోపల లాక్ చేసి ఉండటంతో హత్యా లేక ఆత్మహత్యా తేల్చాల్సి ఉందని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించామని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఏకే వర్మ తెలిపారు. శనివారం రాత్రి 8 గంటలకు మృతురాలిని కలిసేందుకు ఓ మహిళ వచ్చినట్లు పోలీసు విచారణలో తెలిసింది. థాయ్‌లాండ్‌లోని మృతురాలి బంధువుల నుంచి పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. వీధిలోని సీసీకెమెరాల్లో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.