Breaking News

బ్యాంక్ ఆఫ్ ఇండియా-BOI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ : 214 ఉద్యోగాలు


బ్యాంక్ ఆఫ్ ఇండియా-BOI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కేల్ 4 వరకు వేర్వేరు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 214 ఖాళీలున్నాయి. ఎకనమిస్ట్, స్టాటిస్టీషియన్, క్రెడిట్ అనలిస్ట్, క్రెడిట్ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 సెప్టెంబర్ 16న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 30 చివరి తేదీ. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bankofindia.co.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. 
మొత్తం ఖాళీలు- 214
ఎకనమిస్ట్- 4
స్టాటిస్టీషియన్- 2రిస్క్ మేనేజర్- 9
క్రెడిట్ అనలిస్ట్- 60
క్రెడిట్ ఆఫీసర్- 79
ఐటీ (ఫిన్‌టెక్)- 30
ఐటీ (డేటా సైంటిస్ట్)- 3
ఐటీ (డేటా అనలిస్ట్)- 9
ఐటీ (ఇన్ఫో సెక్యూరిటీ)- 8
టెక్ అప్రైజల్- 10