Breaking News

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గా Bollagoni వెంకటేష్ గౌడ్....


గురువారం హైదరాబాద్ ఇబ్రహీంపట్నం వినోబా నగర్ డెవలప్ మెంట్ సొసైటీ, సిద్ధార్థ యోగ విద్యాలయల ప్రకృతి ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట కు చెందిన బోళ్ల లోగోని వెంకటేష్ గౌడ్ ను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన ప్రతిష్ఠాన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేశారు. గాంధీ సంస్థల ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రముఖ నేచర్ క్యూర్ వైద్య నిపుణులు, గాంధీ సంస్థల సుస్థిర వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులైన డాక్టర్ కె. వై. రామచందర్ రావు, గాంధీ సంస్థల డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి లు సంయుక్తంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ KY రామచంద్రరావు గారు మాట్లాడుతూ గాంధీ సంస్థలు ఉచిత ప్రకృతి వైద్యం తో పాటు సుస్థిర క్రీడలు , సమాజ హితానికి అవసరమైన 12 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో కూడిన వివిధ రంగాలలో ఉచిత సేవలు చేయడం ఎంతో గొప్ప విషయం అన్నారు. సమాజ హితం కోసం పాటుపడే సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు గాంధీ సంస్థ చేస్తున్న కృషికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి స్వచ్ఛందంగా పని చేసేవారికి కమిటీలలో ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు.ఈ సందర్భంగా గాంధీ సంస్థల చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ. గత 20 సంవత్సరాలుగా పలు సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల తో పాటు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తున్న బోల్లగొని వెంకటేష్ గౌడ్ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికవడం సంతోషం అన్నారు. గాంధీ సంస్థలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లా మండల,గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకు తీసుకువెళ్లడానికి కృషిచేయాలని అన్నారు. ఈ సందర్భంగా బోళ్లలోగోని వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ గాంధీ సంస్థలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి తనవంతు కృషి చేస్తానన్నాడు. తన నియామకానికి సహకరించిన గాంధీ సంస్థల ప్రతినిధులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కర్నూలు జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలను సుస్థిర అభివృద్ధి కమిటీలను పూర్తిచేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, ఉమ్మడి రాష్ట్రాల ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మెరుగు మధు, సంస్థల రాష్ట్ర సుస్థిరక్రీడా కార్యదర్శి బొమ్మపాల గిరి బాబు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా క్రీడల కార్యదర్శి కుడుముల భాస్కర్ రెడ్డి మరియు గాంధీ సంస్థల అనుబంధ సంఘాల రాష్ట్ర ప్రతినిధులు పాల్గొన్నారు.