Breaking News

Google Meet యూజర్లకి శుభవార్త! మరో కొత్త ఫీచర్


లాక్ డౌన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా Zoomతో పాటు Google Meet వినియోగం కూడా బాగా పెరిగింది. వాస్తవానికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు, అంటే ఈ రోజు వరకు Google Meetలో ప్రీమియం సదుపాయాలను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశాన్ని ఆ సంస్థ వినియోగదారులకు కల్పించింది.

ప్రీమియం సదుపాయాలలో 60 నిమిషాల పరిమితి కలిగిన అపరిమితమైన కాల్ సదుపాయం కూడా ఉంది. అయితే గూగుల్ సంస్థ వినియోగదారులకు శుభవార్త చెబుతూ, మార్చి 2021 వరకు ఎలాంటి కాలపరిమితి లేకుండా Google Meet కాల్స్ చేసుకోవచ్చని వెల్లడించింది. గూగుల్ మీట్ ద్వారా చేసుకునే అన్ని కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. కచ్చితంగా ఇది Zoomకి గట్టి పోటీ ఇస్తుంది అనడంలో సందేహమే లేదు.
వాస్తవానికి Zoomలో కేవలం 40 నిమిషాల్లో పరిమితి కలిగిన వీడియా మీటింగ్స్ మాత్రమే నిర్వహించుకునే వెసులుబాటు ఉంది. Google సంస్థ మరో ఆరు నెలల పాటు పొడిగించిన ఈ అపరిమితమైన కాల్స్ సదుపాయం Google Meetని వినియోగదారులకు మరింత చేరువ చేస్తుంది. ఇటీవల కాలంలో Google Meetలో అనేక కొత్త సదుపాయాలను కూడా ఆ సంస్థ ప్రవేశపెట్టింది. వీడియో మీటింగ్ లో పాల్గొన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యేవిధంగా ఏర్పాటు చేసుకోవడం, చుట్టూ ఉండే పరిసరాల నుండి వచ్చే శబ్దాలు ఇబ్బంది కలిగించకుండా నాయిస్ క్యాన్సిలేషన్ సదుపాయాలు కూడా యూజర్లకు ఉపయుక్తంగా ఉంటాయి.

అలాగే Google Meet వీడియో కాల్‌ని నేరుగా టీవీ స్క్రీన్ మీద క్యాస్టింగ్ చేసుకునే సదుపాయం కూడా కల్పించబడింది. అంతేకాదు ఒకేసారి 49 మంది వ్యక్తులను స్క్రీన్ మీద చూసే అవకాశం కూడా లభిస్తుంది. అలాగే సమీప భవిష్యత్తులో అనేక శక్తి వంతమైన సదుపాయాలను ప్రవేశపెట్టే యోచనలో Google Meet ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ అప్లికేషన్ పెద్దగా వాడని వారు దీనిని ప్రయత్నించవచ్చు. Gmail ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లో నేరుగా Google Meet మీటింగ్స్ క్రియేట్ చేసుకునే అవకాశం కూడా కల్పించబడింది.