Breaking News

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS భారీగా క్లర్క్ పోస్టుల భర్తీ : మొత్తం 2557 ఖాళీలు


ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS భారీగా క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఖాళీలున్నాయి. దరఖాస్తు గడువు త్వరలో ముగుస్తోంది.

 1. బ్యాంకు ఉద్యోగం కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఇటీవల ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS 1557 క్లర్క్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి మరో 1000 పోస్టుల్ని కలిపింది ఐబీపీఎస్. 

 2. మొత్తం 2557 ఖాళీలను భర్తీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడులో భారీగా ఖాళీలు పెరిగాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐబీపీఎస్.  .

 3. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 23 చివరి తేదీ. ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్ 2020 డిసెంబర్ 5, 12, 13 తేదీల్లో ఉంటుంది. 

 4. ప్రిలిమ్స్ ఫలితాలు 2020 డిసెంబర్ 31న విడుదలౌతాయి. మెయిన్స్ కాల్ లెటర్స్ 2021 జనవరి 12న విడుదలౌతాయి. మెయిన్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్ 2021 జనవరి 24న ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ 2021 ఏప్రిల్ 1న ఉంటుంది. 

 5. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలు చూస్తే మొత్తం 2557 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్- 85, తెలంగాణ- 62, అండమాన్ అండ్ నికోబార్- 1, అరుణాచల్ ప్రదేశ్- 1, అస్సాం - 24, బీహార్- 95, చండీగఢ్ - 8, చత్తీస్‌గఢ్ - 18, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ- 4, ఢిల్లీ - 93, గోవా - 25, గుజరాత్- 139, హర్యానా- 72, హిమాచల్ ప్రదేశ్- 45, జమ్మూ కాశ్మీర్ - 7, జార్ఖండ్- 67 పోస్టులున్నాయి. 

 6. వీటితో పాటు కర్నాటక - 221, కేరళ- 120, లక్షద్వీప్ - 3, మధ్యప్రదేశ్- 104, మహారాష్ట్ర - 371, మణిపూర్- 3, మేఘాలయ - 1, మిజోరం- 1, నాగాలాండ్- 5, ఒడిషా- 66, పుదుచ్చెరీ- 4, పంజాబ్- 162, రాజస్తాన్ - 68, సిక్కిం- 1, తమిళనాడు - 229, త్రిపుర - 12, ఉత్తరప్రదేశ్- 259, ఉత్తరాఖండ్- 30, పశ్చిమబెంగాల్- 151 ఖాళీలున్నాయి.

 7. అప్‌డేట్ చేసిన నోటిఫికేషన్, పెరిగిన ఖాళీల సంఖ్యతో పాటు ఇతర వివరాలను https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. రాష్ట్రాల వారీగా ఖాళీల వివరాలతో పాటు విద్యార్హతలను తెలుసుకోండి. 

 8. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేయడం తప్పనిసరి. కంప్యూటర్ ఆపరేషన్స్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి. హైస్కూల్ లేదా కాలేజీలో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. 

9. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‍మెన్‌కు రూ.100. కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.