Breaking News

10 వసంతాలు పూర్తీ చేసుకున్న ఇంస్టాగ్రామ్..!



ఫేస్ బుక్ సొంతం చేసుకున్న ఇంస్టాగ్రామ్ 10 వసంతాలు పూర్తీ చేసుకుంది. ఇంస్టాగ్రామ్ ద్వారా కూడా ఇకపై చిన్న చిన్న బిజినెస్ లకు సహాయం చేయనున్నారు. ఐజీటీవీ ఫీచర్ ద్వారా ఏకంగా బిజినెస్ చేసుకోవచ్చు. రీల్స్ ద్వారా కూడా త్వరలో బిజినెస్ చేయాలని అనుకుంటూ ఉన్నారు. రాబోయే నెలల్లో ఇంస్టాగ్రామ్ లో చాలా మార్పులు వస్తాయని ఇంస్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మెస్సేరి తెలిపారు. ట్యాబ్స్, రీల్స్ ద్వారా షాపింగ్ చేసుకోవచ్చని.. అలాగే మెసేజింగ్ లో కూడా చాలా మార్పులు రాబోతున్నాయని అన్నారు. ఇంస్టాగ్రామ్ యూజర్లకు మాత్రం ఇప్పుడు ఉన్న వినోదం అలాగే కొనసాగుతూ ఉంటుందని చెప్పుకొచ్చారు. పదేళ్లు పూర్తీ చేసుకున్న ఇంస్టాగ్రామ్ కు పలువురు సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు.