Breaking News

ఐఫోన్ 12 మోడల్ ఒక్కదానికే 5G సపోర్ట్

 


యాపిల్ సంస్థ నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫోన్లలో ఐఫోన్ 12 మోడల్ ఒక్కదానికే 5G సపోర్ట్ ఉంది. ఆ సంస్థ విడుదల చేసిన మొత్తం నాలుగు ఐఫోన్ 12 వేరియంట్లకు 5G సపోర్ట్‌ ఉంది. దీంతో పాటు ఫిజికల్ సిమ్, ఈ-సిమ్‌లను వాడే డ్యుయల్ సిమ్ టెక్నాలజీతో వీటిని రూపొందించారు. కొత్త ఐఫోన్ 12 సిరీస్ డ్యూయల్ సిమ్ మోడ్‌లో 5G సపోర్టు ఉండదు. ఈ ఏడాది చివర్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో డ్యూయల్ 5G సపోర్ట్‌ను ఎనేబుల్ చేయాలని యాపిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌కు సంబంధించిన వివరాలను మెక్ రూమర్స్ సంస్థ ప్రచురించింది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్‌12 యూజర్లకు ఈ అప్‌డేట్ రానుందని ఆ సంస్థ వెబ్‌సైట్‌లోని ఇంటర్నల్ వెరిజోన్ స్లైడ్ సూచిస్తుంది. ఐఫోన్‌12లో ఒక eSIMపై 5Gని ఉపయోగించాలంటే, వినియోగదారులు ఫిజికల్ సిమ్ కార్డులను తొలగించాలని నివేదిక పేర్కొంది. డ్యుయల్ సిమ్ మోడ్‌కు సంబంధించిన ఇతర వివరాలను మెక్ రూమర్స్ తెలిపింది. యాపిల్ ఇంటర్నల్ ట్రైనింగ్‌ డాక్యుమెంట్ ప్రకారం... ఐఫోన్‌12లో కస్టరమర్లు రెండు సిమ్ కార్డులు వేస్తే, వాటిలో ఒక్కదానికి కూడా 5జీ సపోర్ట్‌ ఉండదు. సిమ్ నెట్‌వర్క్‌ యాక్సెస్‌ ఆటోమేటిగ్గా 4జీకి పడిపోతుంది. ప్రస్తుతం Redditలో ఉన్న యాపిల్ ఉద్యోగి నుంచి మెక్ రూమర్స్ ఇంతకుముందు ఇంటర్నల్ ట్రైనింగ్ డాక్యుమెంట్‌ను పొందినట్టు తెలిపింది. ఐఫోన్ 12 యూజర్లు కేవలం ఈ-సిమ్ను (ఫిజికల్ సిమ్ కార్డ్ తొలగించి) వాడితేనే 5జీ యాక్సెస్ ఉంటుంది.    5G నెట్‌వర్క్‌ను అందించే వైర్‌లెస్ క్యారియర్‌ను ఐఫోన్‌12 కస్టమర్లు ఎంచుకుంటేనే వారు ఆటోమేటిగ్గా 5G యాక్సెస్ పొందుతారు. రోమింగ్‌లో 5జీని ఉపయోగించడానికి కస్టమర్లు స్థానిక సిమ్ కార్డ్ లేదా ఈ-సిమ్ ప్లాన్‌ను కొనుగోలు చేయాలి. నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న చోట 5జీ ఎనీవేర్ ఆప్షన్‌తో నెట్‌వర్క్‌ను యాక్సెస్‌ చేసుకోవచ్చు.   ఐఫోన్‌12 సిరీస్‌లో యాపిల్ మొత్తం నాలుగు ఫోన్లను విడుదల చేసింది. ఈ జాబితాలో యాపిల్ ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఉన్నాయి. భారత్‌లో ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రో ప్రీ-ఆర్డర్లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12 ప్రో మాక్స్ ప్రీ-ఆర్డర్లు నవంబర్ 6 నుంచి ప్రారంభమవుతాయి.