Breaking News

విటమిన్ బి12 యొక్క ఉపయోగాలు



విటమిన్ బి12 యొక్క ఉపయోగాలు మరియు లోపం వలన కలిగే అనారోగ్యాలుఆరోగ్యకరమైన శరీరాన్ని నిర్వహించటానికి అనేక రకాల విటమిన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా మరియు ప్రధానమైనది విటమిన్ బి12 (vitamin B12) . శరీరంలో జరిగే ప్రతి ముఖ్యమైన క్రియలలో అంటే ఎర్ర రక్త కణాల దగ్గర నుంచి వేలి గోళ్లు వరకు దీని పాత్ర కీలకం.విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఇక్కడ విటమిన్ 12 కు సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.నాడీ వ్యవస్థ పనితీరు, ఎర్ర రక్త కణాల తయారీలోవిటమిన్ బి12 పాత్ర కీలకం. అందువలన ఇది ఆరోగ్యం మొత్తానికి శక్తి ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు.


ఎర్రరక్తకణాల పాత్ర : శరీరానికి ముఖ్యమైన శ్వాసక్రియలో ప్రాణ వాయువును ఊపిరితిత్తుల నుంచి కణజాలాలకు ఎర్ర రక్తకణాలు సరఫరా చేస్తుంటాయి. అలాగే విషతుల్యం లాంటి కార్బన్ డై ఆక్సైడ్ ను కణజాలాల నుంచి ఊపిరితిత్తులకూ సరఫరా చేస్తుంటాయి. ఎర్ర రక్తకణాల తయారీలో విటమిన్ బి12 పాత్ర కీలకమైనందున దీని పరిమాణం చాలా తక్కువగా ఉంటే రక్తహీనత వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

రక్తహీనతకు ప్రధానకారణం ఎర్ర రక్తకణాల సంఖ్య తక్కువగా ఉండటం ఇందుకు ప్రధానకారణం విటమిన్ బి12 లోపం. ఈ విటమిన్ లోపం అలసటకు దారి తీయవచ్చు. అలాగే అధిక రక్తస్రావం, ఐరన్ లోపం కూడా రక్తహీనతకు కారణాలూ. ఎల్లప్పుడూ విటమిన్ బి12 ను సమపాలలో ఉంచుకుంటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు.



డిమెన్షియాను నిరోధించవచ్చు : ఆలోచన మందగించడాన్నే డిమెన్షియా అంటారు. మెదడు కుంచించుకుపోవడం మరియు న్యూరాన్లను కోల్పోవడం వలన మతిమరుపు వంటి వ్యాధి బారిన పడే అవకాశం ఉంది.

రక్తంలో విటమిన్ బి12 మోతాదు తక్కువగా ఉన్నందున్న వారి వారి మెదడు కుంచించుకుపోవడం జరిగిందని అమెరికాలో వృద్ధులపై జరిగిన పరిశోధనలలో వెల్లడయింది.

మెదడు మరియు నాడి వ్యవస్థ పనితీరులో విటమిన్ బి12 పాత్ర కీలకం. ఈ విటమిన్ తగిన మోతాదులో ఉండటం వలన మెదడు పనితీరు సక్రమంగా ఉండి మతిమరుపు (డిమెన్షియా) వ్యాధి నుండి బయటపడవచ్చు.

అయితే శాస్త్రీయంగా ఇప్పటికే అల్జీమర్స్ వలన బాదపడధవారికి విటమిన్ బి12 వలన మతిమరుపు నయమవుతుందని ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు.

పుట్టుకలో వచ్చే లోపాలను దూరం చేయవచ్చు.

ముఖ్యంగా గర్భిణులు విటమిన్ బి12 ను ఎక్కువ మోతాదులో తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇలా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన పుట్టుకతో వచ్చే లోపాలను దూరం చేస్తుంది.

అంతే కాకుండా విటమిన్ బి12 లోపం వలన నోటిపూత, చర్మ సంబంధిత మరియు జుట్టు బలహీనత వంటి అనారోగ్యాలకు కారణమవుతుంది.



విటమిన్ బి12 లభించే ఆహార పదార్థాలు చూసుకుంటే మాంసాహారం, కోళ్ళు , గుడ్లు, పాలు, చేపలు మరియు చిరుధాన్యాలలు వంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది.

విటమిన్ బి12 అనేది మూడు మార్గాల ద్వారా శరీరానికి అందించవచ్చు. సాధారణంగా పెద్దలకు రోజుకు 2.5 మైక్రో గ్రాముల విటమిన్ బి12 అవసరం.

1.విటమిన్ బి12 అధికంగా ఉండే ఆహార పదార్థాలు నోటి ద్వారా తీసుకోవడం.

2. ఇంజక్షన్ రూపంలో కండరానికి ఇవ్వడం ద్వారా మరియు

3.ఐవి డ్రాప్స్ రూపంలో తీసుకోవచ్చు.