Breaking News

నవంబర్ 2 నుంచి పాఠశాలలు.. ప్రతీ స్కూల్ లో వైద్య సిబ్బంది..


 కరోనా నేపథ్యంలో పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. దీంతో విద్యాసంవత్సరం రద్దు చేస్తారా? అన్న సందేహాలు అనేక మందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. నవంబర్ 2 నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కాదని స్పష్టం చేశారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. నవంబరు 2 నుంచి అన్ని జాగ్రత్తలతో పాఠశాలలు నడుస్తాయని స్ఫష్టం చేశారు. అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. ప్రతీ పాఠశాలలో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు.