Breaking News

31 వరకూ ఆన్లైన్ తరగతులే..

రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలు ఈనెల 31 వరకూ ఆన్‌లైన్‌ క్లాసులనే నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటితోపాటు కోచింగ్‌ సెంటర్లు, వినోదపు పార్కులు, సినిమా హాళ్లు, మల్టీఫ్లెక్సులను తిరిగి ప్రారంభించే అంశంపై ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 30న అన్‌లాక్‌-5 మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం.. ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా బుధవారం గైడ్‌లైన్స్‌ను రూపొందించి, విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.