Breaking News

మణిపూర్‌లో మళ్లీ భూకంపం ... రిక్టర్ స్కేలుపై 3.4 నమోదు



మణిపూర్‌లో మళ్లీ శుక్రవారం భూకంపం సంభవించింది. మణిపూర్‌లోని కమ్‌జోంగ్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున 3.12 గంటలకు భూమి కంపించింది. పది కిలోమీటర్ల లోతులో నుంచి వచ్చిన భూప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైనాయి. ఈ భూప్రకంపనలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని మణిపూర్ అధికారులు చెప్పారు. బుధవారం ఉదయం ఉఖ్రూల్ జిల్లాలో భూకంపం సంభవించింది. ఉఖ్రూల్ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.

సెప్టెంబరు 1వతేదీన ఉఖ్రూల్ జిల్లా కేంద్రానికి 55 కిలోమీటర్ల దూరంలో భూకంపం వచ్చింది. ఈ భూకంపం తీవ్రత 5.1గా నమోదైంది. మణిపూర్ లో వరుస భూప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఈ భూప్రకంపనలు పెద్ద భూకంపానికి సూచికలని అంటున్నారు.