Breaking News

బ్రిటన్ లో మరో 3 నెలల్లో కోవిడ్ వ్యాక్సీన్...


బ్రిటన్ లో మరో మూడు నెలల్లో కోవిడ్ వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ ఆక్స్ ఫర్డ్ వ్యాక్సీన్ పై కృషి చేస్తున్న రీసెర్చర్లు.. వచ్ఛే ఏడాది ఆరంభంలో రెగ్యులేటర్లు దీనికి ఆమోదం తెలపవచ్ఛునని అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఆరు నెలల్లోగా ప్రజలందరికీ ఈ టీకా మందు అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు. ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ వ్యాక్సీన్ల సామర్త్యాన్ని తాము సమీక్షిస్తున్నట్టు యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ వెల్లడించింది. సాధ్యమైనంత త్వరగా వీటికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందని ఈ సంస్థ ఆశిస్తోంది. భారీ సంఖ్యలో వలంటీర్లను ఎంపిక చేసి క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయాలన్నది ఈ సంస్థ ధ్యేయం.ఇప్పటికే చాలామంది వలంటీర్ల సెలెక్షన్ పూర్తి అయినట్టు ఈ సంస్థ పేర్కొంది.