Breaking News

అతి తక్కువ ధరలో నోకియా 4జీ ఫోన్లు

\


హెచ్‌ఎండీ గ్లోబల్‌ కంపెనీ భారత్‌లో రెండు కొత్త ఫీచర్‌ ఫోన్లను ఆవిష్కరించింది. నోకియా 215 4G, నోకియా 225 4G పేరుతో విడుదలైన ఫోన్లు ద్వారా 4G VoLTE కాలింగ్‌ చేసుకోవచ్చు. అలాగే వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం రేడియో సదుపాయం కూడా ఇందులో ఉంది. ఈ ఫీచర్‌ ఫోన్లలో ఫంక్షన్‌ కీ(కీప్యాడ్‌)లు ఉన్నాయి. నోకియా 225 4జీ ఫోన్‌ వెనకవైపు కెమెరా కూడా ఉంది. వినియోగదారులు ఫొటోలు తీసి ఇతరులకు షేర్‌ కూడా చేసుకోవచ్చు. 215 4G, 225 4G ఫోన్లను ఈనెల ఆరంభంలోనే చైనాలో రిలీజ్‌ చేశారు.


భారత్‌లో నోకియా 215 4జీ ధర రూ.2,949 కాగా నోకియా 225 4జీ ఫోన్‌ ధర రూ. 3,499గా నిర్ణయించారు. 215 మోడల్‌ బ్లాక్‌, సియాన్‌ గ్రీన్‌ కలర్లలో అందుబాటులో ఉంది. 225 ఫీచర్‌ ఫోన్‌ బ్లాక్‌, క్లాసిక్‌ బ్లూ, మెటాలిక్‌ సాండ్‌ కలర్లలో విడుదలైంది. అక్టోబర్‌ 23 నుంచి నోకియా ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. నవంబర్‌ 6 నుంచి యూజర్లు ఆఫ్‌లైన్‌ ద్వారా ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.


నోకియా 215 4జీ స్పెసిఫికేషన్లు:


డిస్‌ప్లే: 2.40 అంగుళాలు


ప్రంట్‌ కెమెరా: లేదు


రియర్‌ కెమెరా: లేదు


ర్యామ్‌: 64 ఎంబీ


స్టోరేజ్‌: 128 ఎంబీ


బ్యాటరీ: 1150mAh


ఓఎస్‌:Series 30+


నోకియా 225 4జీ స్పెసిఫికేషన్లు:


డిస్‌ప్లే: 2.40 అంగుళాలు


ప్రంట్‌ కెమెరా: లేదు


రియర్‌ కెమెరా: 0.3 మెగాపిక్సల్‌


ర్యామ్‌: 64 ఎంబీ


స్టోరేజ్‌: 128 ఎంబీ


బ్యాటరీ:1150mAh


ఓఎస్‌: Series 30+