Breaking News

సన్‌రైజర్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో విజయం



ఇవాళ ఈ రోజు దుబయ్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టుపై రాజస్థాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠభరింతగా కొనసాగింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ తెవాటియా, రియాన్ పరాగ్ మెరుపులతో రాజస్థాన్ జట్టు లక్ష్యాన్ని చేధించింది విజయాన్ని కైవసం చేసుకున్నారు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. మనీష్ పాడే 54, డేవిడ్ వార్నర్ 48 ఆకట్టుకున్నారు. విలియమ్సన్ 22 పరుగులతో పరవాలేదనిపించాడు. ఎన్నో అంచనాల మధ్య బ్యాటింగ్‌కు దిగిన బెయిర్ స్టో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే.. కెప్టెన్ వార్నర్‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 15వ ఓవర్లలో వార్నర్ ఔటవడంతో స్కోర్ బాధ్యత పాండేపై పడింది. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం 18 ఓవర్లో పాండే పెవిలియన్‌కు చేరాడు. ఆఖరులో ప్రియమ్ గార్గ్ సిక్స్, ఫోర్ కొట్టడంతో సన్ రైజర్స్ స్కోర్ 158కి చేరింది. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, కార్తీక్ త్యాగి, ఉనద్కట్ తలో వికెట్ పడగొట్టారు.