Breaking News

రియల్ మీ ఎక్స్7 సిరీస్ తో పాటు రియల్ మీ వీ3 ఫోన్ లాంచ్రియల్ మీ ఎక్స్7 సిరీస్ తో పాటు రియల్ మీ వీ3 ఫోన్ కూడా లాంచ్ అయింది. రియల్ మీ లాంచ్ చేసిన అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే. అయితే ఈ ధరలోనే మంచి ఫీచర్లను అందించడం విశేషం. ఇందులో సెల్ఫీ కెమెరాను నాచ్ లో అందించారు. వెనకవైపు మూడు కెమెరాలు కూడా ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ మొదటగా చైనాలో లాంచ్ అయింది.

ఇందులో మొత్తం మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 999 యువాన్లుగా(సుమారు రూ.10,700) నిర్ణయించారు. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లుగానూ(సుమారు రూ.15,000), 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగా(సుమారు రూ.17,100) ఉంది. బ్లూ, సిల్వర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీనికి సంబంధించిన సేల్ సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.