Breaking News

ఘనంగా భారత వైమానిక దళం 88వ వ్యవస్థాపక దినోత్సవం



 భారత వైమానిక దళం 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఢిల్లీకి సమీపంలోని హిండన్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వేదికగా ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకల్లో రాఫెల్‌ యుద్ధవిమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటి విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. పలు యుద్ధ విమానాలు తమ సైనిక విన్యాసాలను ప్రదర్శించాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వైమానిక దళానికి శుభాకాంక్షలు తెలిపారు. ఎయిర్‌ఫోర్స్‌డే సందర్భంగా సైనికులను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా ట్విటర్‌ ద్వారా అభినందనలు తెలిపారు.

ఐఎఎఫ్‌ మరింత బలోపేతం : రాష్ట్రపతి

ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రాఫెల్‌ యుద్ధ విమానాలు, ఆపాచీ, చినూక్‌ హెలికాప్టర్లను ప్రవేశంతో చేపట్టిన ఆధునీకరణ ప్రక్రియ భారత వైమానిక దళాన్ని మరింత బలీయమైన వ్యహాత్మక శక్తిగా మారుస్తుందన్నారు.