Breaking News

నిరుద్యోగులకు BEL శుభవార్త..


 భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) ఇంజనీరింగ్ డిప్లొమా అభ్యర్థుల నుంచి 'టెక్నీషియన్ అప్రెంటిస్ (టీఏపీపీ)' గా శిక్షణ పొందటానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారికి అప్రెంటిస్‌షిప్ చట్టం, 1961 ప్రకారం నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (నాట్స్) కింద ఒక సంవత్సరం పాటు BEL బెంగళూరులో శిక్షణ ఇవ్వనున్నాను. మరిన్ని వివరాలను అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ లో చూసుకోవచ్చు. ఇందుకోసం దరఖాస్తు చేయడానికి నవంబర్ 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10, 400 స్కాలర్ షిప్ అందిస్తారు. విద్యార్థులు పది పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.


-ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేయాలి
-జనవరి 1, 2018 తర్వత డిప్లొమా పూర్తి చేసిన వారే దరఖాస్తుకు అర్హులు.