Breaking News

సిరియాలో అల్‌ఖైదాపై అమెరికా వైమానిక దాడి...


 సిరియా దేశంలోని ఇడ్లిబ్ సమీపంలోని అల్ ఖైదా శిబిరంపై అమెరికా సైనికులు జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు అల్ ఖైదా ఉగ్రవాదులు హతమయ్యారు.ఈ నెల 22 వ తేదీన సిరియాలోని అల్ ఖైదా ఉగ్రవాద శిబిరంపై అమెరికా వైమానిక దళం జరిపిన దాడిలో అల్ ఖైదాకు చెందిన ఏడుగురు సీనియర్ నాయకులు హతమయ్యారని అమెరికా తాజాగా ప్రకటించింది. అయితే మరణించిన ఏడుగురు ఉగ్రవాదుల పేర్లను మాత్రం ఇంకా గుర్తించలేదు.

అమాయక పౌరులను బెదిరించే ఉగ్రవాదులను మట్టు పెట్టడానికి అమెరికా ఈ దాడి చేసిందని సెంట్రల్ కమాండ్ ప్రతినిధి మేజర్ బెత్ రియోర్డాన్ విలేఖరులకు చెప్పారు. ఈ నెల 15వతేదీన కూడా అమెరికా సిరియాలో అల్ ఖైదా ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు చేసింది.

తాము మిత్రదేశాలు, భాగస్వాములతో కలిసి అల్ ఖైదాతోపాటు ఇతర ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తామని సెంట్రల్ కమాండ్ ప్రతినిధి మేజర్ బెత్ రియోర్డాన్ వివరించారు.