Breaking News

తెలంగాణ వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలుతెలంగాణ వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆటపాటలతో వేడుకల్లో పాల్గొంటున్నారు. కరోనా వైరస్ ను లెక్కచేయకుండా పల్లె పల్లెనా.. వాడ వాడనా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.  ఈ ఏడాది అధిక మాసం రావడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మను శుక్రవారం రోజు నిర్వహించారు. ప్రతి 19 ఏళ్లకు ఒకసారి ఇలా అధికమాసం వస్తుంది. ఇక వచ్చే నెల 17 నుండి బతుకమ్మ సంబురాలు తిరిగి ప్రారంభం అవ్వనున్నాయి. ఇక అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మను జరుపుకొంటున్నారు.  ఊరంతా పూల వనమల్లే తొమ్మిది రోజులు సంబురంగా గౌరమ్మను పూజించి.. గంగమ్మ సాక్షిగా సంగనంపుతరు. ప్రకృతిని ఇంతగా ఆరాధించే పండుగ మన రాష్ట్రంలోనే కనిపిస్తుంది.  ఇవాళ అమావాస్య సందర్భంగా బతుకమ్మ  తొలి రోజు వేడుక మొదలవుతుంది. మొదటిరోజు తీరొక్క పూలతో పేర్చిన  ఎంగిలిపూల బతుకమ్మను కొలుస్తారు. మహిళలు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేసి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మకు సమర్పిస్తారు.