Breaking News

ఎస్బీఐ నూతన చైర్మన్ గా దినేశ్ కుమార్ ఖారా

 


న్యూఢిల్లీ: ఎస్బీఐ నూతన చైర్మన్ గా దినేశ్ కుమార్ ఖారా చేపట్టనున్నారు. నేటితో ఎస్బీఐ ప్రస్తుత చైర్మన్ రజనీశ్ కుమార్ పదవీ కాలం ముగియనుంది. దీంతో ఇప్పటికే కేంద్రం ఎస్బీఐ నూతన చైర్మన్ పేరును ప్రకటించింది. దినేశ్ కుమార్ 3 సంవత్సరాల పాటూ ఎస్బీఐ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దినేశ్ కుమార్ గతంలో ఎస్బీఐలోనే మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు.