Breaking News

దసరా శోభాయాత్రలో సీఎం...అధికారులు ఏర్పాట్లు

 

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన స్వస్థలమైన గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మందిరంలో దసరా సందర్భంగా ప్రతీయేటా ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు. అలాగే శోభాయాత్రలోనూ పాల్గొంటారు. ఈరోజు దసరా సందర్బంగా శోభాయాత్రకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

శోభాయత్రలో పాల్గొనే ప్రజలను నియంత్రించేందుకు పోలీసు బలగాలను మోహరించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా సారించనున్నారు. కరోగా గైడ్‌లైన్స్‌ను దృష్టిలో ఉంచుకుని శోభాయాత్రకు పరిమిత సంఖ్యలోనే ప్రజలకు అనుమతి ఇవ్వనున్నారు. పురాతన సంప్రదాయాలను అనుసరించి గోరఖ్ నాథ్ మందిరం నుంచి ప్రతీయేటా విజయదశమి నాడు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో గోరక్షపీఠాధీశ్వర రథంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ కూర్చొని ఊరేగింపుగా తరలి వెళ్లేవారు.