Breaking News

ప్లే ఆఫ్‌ నుంచి సీఎస్‌కే నిష్క్రమణ

 


 మూడుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌కింగ్స్‌ ఈసారి పేలవ ప్రదర్శనతో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐపీఎల్‌- 2020 సీజన్‌లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి, కనీసం ప్లే ఆఫ్స్‌కు కూడా చేరకుండా చతికిలపడింది. ఆదివారం నాటి మ్యాచ్‌లో ఆర్సీబీపై విజయం సాధించినప్పటికీ, ఆ గెలుపును అభిమానులు పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి వైదొలిగిన తొలిజట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న సీఎస్‌కే ఆట తీరుతో నైరాశ్యంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు కెప్టెన్‌ ధోని సతీమణి సాక్షి ధోని సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు. ఆటలో గెలుపోటములు సహజమని, తన దృష్టిలో సీఎస్‌కే ఎప్పుడూ విన్నరే అంటూ ఓ పద్యాన్ని షేర్‌ చేశారు.