Breaking News

సూర్యుడి పనితీరుపై చేస్తున్న పరిశోధనల్లో రోజురోజుకీ కొత్త విషయాలు వెలుగు


సూర్యుడి పనితీరుపై చేస్తున్న పరిశోధనల్లో రోజురోజుకీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో సూర్యుడి గురించి అధ్యయనం చేయడానికి అంతరిక్షంలోకి పంపిన ఒక స్పేస్ క్రాఫ్ట్..సూర్యుడు ప్రస్తుతం నిశ్శబ్ద స్థితిలో ఉన్నట్టు చెబుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఫిబ్రవరిలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సోలార్ ఆర్బిటర్ అంతరిక్ష నౌకను ప్రయోగించింది. సూర్యుడిని అధ్యయనం చేయడమే ఈ మిషన్ లక్ష్యం. జూన్ నుంచి పని చేయడం మొదలు పెట్టిన ఆ అంతరిక్ష నౌక పది ఇన్స్ట్రుమెంట్ల ద్వారా సోలార్ డేటాను సేకరిస్తోంది. ప్రస్తుతం సూర్యుడు నిశ్శబ్ద దశలో ఉన్నాడని ఆ డేటా ఆధారంగా శాస్ర్తవేత్తలు నిర్ధారించారు.

భూమిపై ఉన్న అన్ని జీవులకు సూర్యుడి గమనమే మూలం. సూర్యుడి ఉపరితలం న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ స్థితిలో ఉంది. ఈ స్థితిని సన్స్పాట్ అని పిలుస్తారు. ఇలాంటి సన్స్పాట్లు 11 సంవత్సరాల చక్రాన్ని అనుసరించి ఏర్పడతాయి. కానీ ఇప్పుడు అక్కడ ఎలాంటి సన్స్పాట్లు లేవు. దీని వల్ల ప్రమాదం ఉంటుందా?
దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పేస్ సైంటిస్ట్లు చెబుతున్నారు. సూర్యుడి పనితీరుపై సన్స్పాట్లు ఎలాంటి ప్రభావం చూపవని వారు పేర్కొంటున్నారు. ఇది ఊహించిన మార్పేనని వారు అంటున్నారు. ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి సౌర చక్రం ఎబ్బ్స్(హై- యాక్టివిటీ) అండ్ ఫ్లోస్(లో- యాక్టివిటీ)లకు గురవుతాయి. రాబోయే సంవత్సరాల్లో క్రమంగా సన్ స్పాట్ యాక్టివిటీ పెరుగుతుంది. సూర్యుడు మరింత చురుకుగా ఉంటాడు.

భూమిపై ఉండే సమాచార వ్యవస్థపై ప్రభావం
హై యాక్టివిటీకి కారణంగా అంతరిక్ష వాతావరణంలో మార్పులు(బ్యాడ్ స్పేస్ వెదర్) జరగే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు సూర్యుడి నుంచి భారీ మొత్తంలో పదార్థాలు, శక్తి విడుదలవుతాయి. ఇది సౌర మంటలు(solar flares)కు, మాస్ కరోనల్ ఎజెక్షన్లకు కారణమవుతుంది. సౌర మంటలు రేడియో తరంగాలను ప్రభావితం చేస్తాయి. దీంతో భూమిపై సమాచార వ్యవస్థకు అంతరాయం ఏర్పడుతుంది.

శుక్ర గ్రహం కక్ష్యలోకి సోలార్ ఆర్బిటార్సూర్యుడి పనితీరుకి దాని అయస్కాంత క్షేత్రం ముడిపడి ఉంటుంది. సోలార్ ఆర్బిటార్ నౌకలో వీటిని కొలిచే పరికరాలు ఉన్నాయి. వీటిల్లో మ్యాగ్నటో మీటర్(MAG) ఒకటి. ఇది మూడు నెలలకు సంబంధించిన డేటాను భూమికి పంపింది. ఇది కొన్ని కోట్లసార్లు మ్యాగ్నటిక్ ఫీల్డ్ డైరెక్షన్ను, దాని సామర్థ్యాన్ని అంచనా వేసింది. ఈ సోలార్ ఆర్బిట్ శుక్ర గ్రహం కక్ష్యలోకి కూడా వెళ్లింది. అక్కడి నుంచే సూర్యుడికి దగ్గరగా ఉండే డేటాను సేకరించి విశ్లేషిస్తోంది. ఈ నౌక రాబోయే సంవత్సరాల్లో సూర్యుడికి మరింత దగ్గరగా వెళ్తుంది.

నిపుణులు ఏమంటున్నారు?
ప్రస్తుతానికి సూర్యుని అయస్కాంత క్షేత్ర 'భూమధ్యరేఖ' వాస్తవ భూమధ్యరేఖ మాదిరిగానే ఉంది. దీంతో భూమధ్యరేఖకు చాలా దగ్గరగా ఉన్న ఉత్తర అయస్కాంత క్షేత్రాలను అధ్యయనం చేయడం సోలార్ ఆర్బిట్కు సులభం కానుంది. సూర్యుడి యాక్టివిటీ ఎక్కువగా ఉంటే, అయస్కాంత భూమధ్యరేఖ మారుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అయస్కాంత క్షేత్రం పొలారిటీని ఎక్కువ సమయం అధ్యయనం చేయడం సాధ్యంకాదు. సూర్యుడి నుంచి విడుదలయ్యే ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లను MAG విశ్లేషించింది. ఇవి భూమికి సమీపంలో 'సన్బీమ్స్' ఏర్పడేందుకు కారణమవుతున్నాయని ఆ డేటా చెబుతోంది. ఈ ఫలితాలు అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానానికి, మానవ సంకల్పానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు. ఒక అంతరిక్ష నౌకను సూర్యుడి మీదకు పంపించడం, కేవలం మూడు నెలల్లోనే అది ఎంతో విలువైన సమాచారాన్ని భూమికి పంపడం మంచి విషయమని వారు చెప్పారు.