Breaking News

రకుల్ పుట్టిన రోజు సందర్బంగా చిత్రం చెక్ ఫస్ట్ లుక్ రిలీజ్...!



నితిన్ ప్రధాన పాత్రలో చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తున్న చిత్రం చెక్. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందుతోంది. ఇటీవలే విడుదల చేసిన ఈ చిత్ర ప్రీ లుక్‌ ప్రేక్షకలోకాన్ని విశేషంగా ఆకట్టుకుంది. చిత్రానికి వి. ఆనంద ప్రసాద్ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా.. ఇందులో రకుల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.  నిన్న 10 October రకుల్ పుట్టిన రోజు సందర్బంగా ఆమె తాలూకా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఇందులో చాలా సీరియస్‌గా కనిపిస్తున్న రకుల్.. చేతిలో ఓ ఫైల్ పట్టుకొని ఉంది. ఈ లుక్ ఫ్యాన్స్‌ని ఎంతగానో అలరిస్తుంది. ఇక ఈ మూవీ లో ప్రియా ప్రకాష్ వారియర్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు.  చదరంగం నేపథ్యంలో సాగే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ ఉరిశిక్ష పడిన ఖైదీగా నటిస్తారని టాక్. ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకు చివరి షెడ్యూల్ పూర్తిచేసి రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించబోతున్నారు.