Breaking News

అంకుల్‌ జోషి..


 వృద్ధాప్యం శాపంలా భావిస్తూ కాటికి కాళ్లు చాపుకుని రోజులు వెళ్లబుచ్చుతుంటారు చాలా మంది. అతి తక్కువమంది మాత్రమే దేవుడు ఆయుష్షును బోనస్‌లా ఇచ్చాడు అనుకుంటూ ఉన్న జీవితాన్ని అర్ధవంతంగా మలుచుకుంటారు. అలా అర్థవంతంగా జీవిస్తున్న జోషి అనే 87 ఏళ్ల వ్యక్తి కథ ఇటీవల సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పడేసే గుడ్డ పీలికలతో సంచులను తయారు చేసి, వాటిని విక్రయిస్తూ ఇప్పుడు అందరి మనసులను గెలుచుకుంటున్నాడు.

అంకుల్‌ జోషి..
ముంబైలోని డొంబివాలిలో ఈ తాత చేతి సంచులను అమ్ముతూ కనిపిస్తుంటాడు. స్వశక్తిపై జీవిస్తున్న జోషి కథను ట్విట్టర్‌ యూజర్‌ గౌరీ వెలుగులోకి తెచ్చారు. 'అంకుల్‌ జోషి' వయసు 87. అతను అమ్మే ఒక్కో సంచి రూ .40