Breaking News

ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం



 ఒడిశా లోని భువనేశ్వర్‌లో రాజ్‌భవన్‌కు సమీపాన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన పెట్రోల్ బంకులో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడగా, ఇద్దరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, వీరిని వెంటనే కటక్ లోని ఎస్‌సిబి ఆస్పత్రికి తరలించామని అధికారులు తెలిపారు. పెట్రోలు, డీజిల్ ఉన్న ఇతర ట్యాంకులకు మంటలు విస్తరించకుండా చర్యలు తీసుకొంటున్నట్టు పోలీస్ కమిషనర్ ఎస్‌ఎస్ సారంగి తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు.