Breaking News

రామచంద్ర ప్రకృతి ఆశ్రమం సేవలు ప్రజలు ఉపయోగించుకోవాలి ....... మంత్రి గుంత కండ్ల జగదీశ్వర్రెడ్డి




వినోభా గ్రామం ఇబ్రహీంపట్నంలో ప్రముఖ ప్రకృతి వైద్యులు డాక్టర్ రామచంద్ర మరియు కే వై పద్మ గార్ల ఉచిత ప్రకృతి వైద్య సేవలు ప్రజలందరూ ఉపయోగించుకోవాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి మంత్రితో కలిసి ప్రకృతి ఆశ్రమం కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో లో  ప్రకృతి వైద్య సేవలు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి అని అన్నారు. వినోభా ఆశ్రమంలో అందుతున్న సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని ప్రస్తుత కాలంలో అప్రమత్తంగా ఉండాలని అని అన్నారు.

గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వినోభా గ్రామంలో కొనసాగుతున్న ప్రకృతి సేవలు అభినందనీయమని వారన్నారు. సమయం చూసుకొని సందర్శిస్తారని మంత్రి హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారం లింగారెడ్డి, ట్రస్మా సూర్యాపేట జిల్లా కోశాధికారి పగడాల ఉపేందర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు