Breaking News

ధోనీ సారథ్యంలో మరో సారి ఓడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌



ధోనీ సారథ్యంలో మరో సారి ఓడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌  . బ్యాటింగ్‌ వైఫల్యంతో మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ మరోసారి ఓడింది. ఐపీఎల్‌-13లో శనివారం జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో పరాజయం పాలైంది. విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ మెరుపులకు తోడుగా బౌలర్లు చెలరేగడంతో బెంగళూరు వరుసగా మూడో గెలుపు నమోదు చేసింది. 170 పరుగుల ఛేదనలో బెంగళూరు బౌలర్లు వాషింగ్టన్‌ సుందర్‌(2/16), క్రిస్‌ మోరీస్‌(3/19)ల ధాటికి చెన్నై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేసింది. అంబటి రాయుడు(42: 40 బంతుల్లో 4ఫోర్లు), జగదీశన్‌(33: 28 బంతుల్లో 4ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది అంతకుముందు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(90 నాటౌట్:‌ 52 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. దేవ్‌దత్‌ పడిక్కల్‌(33: 34 బంతుల్లో 2ఫోర్లు, సిక్స్‌) రాణించడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 4 వికెట్లకు 169 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌ ఆద్యంతం క్రీజులో నిలిచిన కెప్టెన్‌ విరాట్‌ చెన్నైపై యధేచ్ఛగా విరుచుకుపడి జట్టుకు మెరుగైన స్కోరు అందించాడు. చెన్నై బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌(2/40) రెండు వికెట్లు తీయగా.. శామ్‌ కరన్‌, దీపక్‌ చాహర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.