Breaking News

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) అధ్యక్ష పదవికి దరఖాస్తుల ఆహ్వానం



అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసిసి) అధ్యక్ష పదవికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా సోమవారం ప్రకటించింది. ఐసిసి ఓ ప్రకటనలో ఐసిసి బోర్డు డైరెక్టర్లు, సభ్యులతోపాటు, ఛైర్మన్‌ పదవికి ఆసక్తి, అర్హతగల సభ్యులు దరఖాస్తులు చేసుకోవాలని, దరఖాస్తులు చేసుకోవడానికి అక్టోబర్‌ 18 ఆఖరు తేదీ అని ఆ ప్రకటనలో తెలిపింది. శశాంక్‌ మనోహర్‌ పదవీకాలం పూర్తవ్వడంతో ఆయన ఆ పదవినుంచి వైదొలగడంతో ఐసిసి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు దరఖాస్తులను ఆహ్వానించని ఐసిసి ఎన్నికలు అనివార్యమైన పక్షంలో డిసెంబర్‌లో జరపనున్నట్లు తెలిపింది.