Breaking News

సోనూ సూద్ నుండి .. ఐఏఎస్ కావాలనుకునేవారికి స్కాలర్‌షిప్స్



కలెక్టర్ కావాలనుకుంటున్నారా? ఐఏఎస్ ఆఫీసర్ కావడం మీ కలా? మీకు గుడ్ న్యూస్. సినీ నటుడు సోనూ సూద్ ఐఏఎస్ కావాలనుకునేవారికి స్కాలర్‌షిప్స్ ప్రకటించారు. సోనూ సూద్ పేరు వింటే నటుడి కన్నా ధాతృత్వ కార్యక్రమాలు చేసే వ్యక్తిగా గుర్తురావడం సహజమే. లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలను ఇళ్లకు చేర్చడం దగ్గర్నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకునేంత వరకు సోనూ సూన్ అనేక సహాయ కార్యక్రమాలను చేశారు. చేస్తూనే ఉన్నారు. ట్విట్టర్‌లో, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో సాయం కోసం ఎవరు సంప్రదించినా కాదనకుండా ఆదుకుంటూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు సోనూ సూద్. ఇప్పుడు మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సోనూ సూద్. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోతున్నవారికి సాయం చేస్తున్నారు. కొందరు విద్యార్తులు గ్యాడ్జెట్స్ లేకపోవడం వల్ల ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ కాలేకపోతున్నారని తెలుసుకొని స్మార్ట్‌ఫోన్లు పంపారు. జేఈఈ, నీట్ లాంటి పరీక్షలు రాయడానికి విద్యార్థులు దూరప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు సాయం చేశారు. స్కాలర్‌షిప్స్ ఇచ్చేందుకు ఇందుకోసం https://scholifyme.com/ పేరుతో ఓ వెబ్‌సైట్ కూడా గతంలోనే ప్రారంభించారు.