Breaking News

పండుగ సీజన్ సందర్భంగా ప్రత్యేకమైన సేల్స్ ... ప్రత్యెక ఆకర్షణలు



Amazon India, Flipkart సంస్థలు రెండూ పండుగ సీజన్ సందర్భంగా ప్రత్యేకమైన సేల్స్ తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. Flipkartలో అక్టోబర్ 16 వ తేదీన ఈ సేల్ మొదలవుతుంది. అనేక ఉత్పత్తుల మీద భారీగా డిస్కౌంట్స్ లభిస్తున్న సందర్భంగా ఆ సమయంలో అనేక వస్తువులు హాట్ కేక్స్‌లా అమ్ముడుపోయే అవకాశం ఉంది. అందుకే స్టాక్ అయిపోయి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం Flipkart కేవలం ఒకే ఒక రూపాయి చెల్లించి మీకు కావలసిన ఉత్పత్తులు pre-book చేసుకునే సదుపాయం తీసుకువచ్చింది ప్రస్తుతానికి కొన్ని ఉత్పత్తులను ఇలా pre-book చేసుకోవచ్చు. దీనికోసం ఈ లింక్‌లో మీకు నచ్చిన విభాగంలోకి వెళ్లి మీకు కావలసిన ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకొని, వాటి ధరలో ఒక్క రూపాయిని చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన మొత్తాన్ని అక్టోబర్ 16 వ తేదీన చెల్లించాల్సి ఉంటుంది. ఈరోజు నుండి అక్టోబర్ 14వ తేదీ వరకు ఇలా మీకు కావలసిన ఉత్పత్తులను pre-book చేసుకునే వెసులుబాటు కలుగుతుంది . Flipkart నిర్వహిస్తున్న ఈ Big Billion Saleలో SBI కార్డు వాడే వినియోగదారులకు 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఇలా ఎస్బిఐ కార్డు మీద క్యాష్ బ్యాక్ పొందాలనుకునే వినియోగదారులు pre-book చేసుకోకండి. ప్రీబుక్ చేసుకున్నవారికి అసలు మొత్తం చెల్లించే సమయంలో క్యాష్ బ్యాక్ లభించదు. ప్రీ-బుక్ ఆఫర్లని బ్యాంక్ ఆఫర్లతో కలిపి అందించటం సాధ్యం కాదని ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. ప్రస్తుతానికి కేవలం ఈ లింకులో ఉన్న pre-booking ఈ పేజీలో ఉన్న ఉత్పత్తులు మాత్రమే ప్రీబుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.


కిచెన్, షూస్, హోమ్, అపెరెల్స్ వంటి వివిధ ఉత్పత్తులు ఇప్పుడు ప్రీబుకింగ్ చేసుకోవడానికి సిద్ధంగా లభిస్తున్నాయి. కాబట్టి ఈ లింక్ ద్వారా మీకు కావలసిన వాటికి ఒక్క రూపాయి చెల్లించి ఇప్పుడే ప్రీ-బుకింగ్ చేసుకోండి.. స్టాక్ అయిపోతుందన్న భయం ఇక అవసరం లేదు.