Breaking News

టీనేజర్‌ సరికొత్త ఉపాయం


 కొడుకుపై నమ్మకంతో పెద్ద ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలో దిగేందుకు ఓ తండ్రి సిద్ధపడ్డాడు. కుమారుడి ఆలోచనకు వాస్తవ రూపం ఇచ్చేందుకు ఆయన ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. గోడలకు మేకులు కొట్టకుండానే బరువులను వేలాడదీసేందుకు దుబాయ్‌లో నివసిస్తున్న భారత టీనేజర్‌ సరికొత్త ఉపాయాన్ని కనిపెట్టాడు. జెమ్స్‌ వరల్డ్‌ అకాడమిలో ప్రస్తుతం 10వ గ్రేడ్‌ చదువుతున్న ఇషిర్‌ వాద్వా తన స్కూల్‌ ప్రాజెక్టు కోసం ఈ విభిన్న ఆలోచన చేశాడు. ఇంజినీరింగ్‌ చదువుతున్న తన సోదరుడు అవిక్‌ సాయంతో ఈ సరికొత్త మార్గాన్ని అన్వేషించారు.