Breaking News

సీజన్‌తో పాటు చర్మసంరక్షణలో మార్పులు


 సీజన్‌తో పాటు చర్మసంరక్షణలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. వాతావరణంలో మార్పులు చర్మం మీద ప్రభావం చూపుతాయి. ఈ సీజన్‌లో అందాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలంటే...

ఒక టీస్పూన్‌ చొప్పున కాఫీ పొడి, కొబ్బరినూనె, సగం టీస్పూన్‌ బియ్యప్పిండి తీసుకొని ఫేస్‌ప్యాక్‌ తయారుచేసుకోవాలి. ఈ ఫ్యాక్‌ను ముఖం, మెడ చుట్టూ వేళ్లతో మర్దనా చేసినట్టు రాసుకోవాలి.

పది నిమిషాల తరువాత వేడినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్‌ప్యాక్‌ మృతకణాలను తొలగించి, చర్మానికి తాజాదనాన్ని, బిగుతుగుణాన్ని ఇస్తుంది. కొబ్బరినూనెలోని ఫ్యాటీఆమ్లాలు చర్మానికి తేమను అందిస్తాయి.

కాఫీపొడిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.