Breaking News

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పోలీస్ అధికారుల


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పోలీస్ అధికారుల తుది కేటాయింపును చేసింది. ఏపీ, తెలంగాణకు నాన్ కేడర్ ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీలను కేటాయించింది. 52:48 నిష్పత్తి ప్రకారం ఈ కేటాయింపులు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ప్రకారం ఏపీకి 16 మంది నాన్ కేడర్ ఎస్పీలు, 64 మంది అదనపు ఎస్పీలు, 302 మంది డీఎస్పీలను కేటాయించింది. తెలంగాణ‌కు 9 మంది నాన్ కేడర్ ఎస్పీలు, 49 మంది అదనపు ఎస్పీలు, 192 మంది డీఎస్పీలను కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.