Breaking News

జనాలకు షాకింగ్ న్యూస్ చెప్పిన రెల్వే శాక



హై స్పీడ్ నెట్‌వర్క్‌ ఆధునికీకరణలో భాగంగా కొన్ని రైళ్ళలో నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ బోగీలను తొలగించాలని భారతీయ రైల్వేలు నిర్ణయించాయి. వీటి స్థానంలో ఎయిర్ కండిషన్డ్ బోగీలను ఏర్పాటు చేయబోతున్నాయి రైల్వే మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి డీజే నారాయణ్ తెలిపిన వివరాల ప్రకారం, గంటకు 130 కిలోమీటర్లు, అంత కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్ళలో నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ బోగీలను తొలగించి, వాటి స్థానంలో ఎయిర్ కండిషన్డ్ బోగీలను ఏర్పాటు చేస్తారు. అయితే గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్ళలో స్లీపర్ క్లాస్ బోగీలు ఉంటాయి. గంటకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్ళలో ఈ మార్పులు చేస్తారు. ఈ రైళ్ళకు అనువైన రీతిలో గోల్డెన్ క్వాడ్రిలేటరల్, డయగోనల్ ట్రాక్‌లను అభివృద్ధిపరుస్తున్నారు. గంటకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్ళలో ఏసీ బోగీలు సాంకేతికంగా తప్పనిసరి అని నారాయణ్ తెలిపారు. ప్రయాణికుల సదుపాయానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. టిక్కెట్ ఛార్జీలు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ రైళ్ళలో ప్రయాణించడం వల్ల ప్రయాణ కాలం తగ్గుతుందని చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా మార్గాల్లో ఈ మార్పులు జరుగుతాయన్నారు.