Breaking News

యూకో బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్


 యూకో బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ కేడర్ స్కేల్ 1, స్కేల్ 2 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సెక్యూరిటీ ఆఫీసర్, ఇంజనీర్, ఎకనమిస్ట్, ఐటీ ఆఫీసర్, సీఏ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 91 ఖాళీలు ఉన్నాయి. దేశంలోని పలు బ్రాంచ్‌లల్లో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2020 అక్టోబర్ 27న దరఖాస్తు ప్రక్రియ మొదలుకానుంది. అప్లై చేయడానికి 2020 నవంబర్ 17 చివరి తేదీ. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ucobank.com/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.


UPSC Jobs: యూపీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్... రెండు రోజుల్లో అప్లై చేయండి SSC Recruitment 2020: గుడ్ న్యూస్... ఇంటర్ పాసైనవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు- 91
సెక్యూరిటీ ఆఫీసర్- 9
ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్ట్)- 8ఎకనమిస్ట్- 2
స్టాటిస్టీషియన్- 2
ఐటీ ఆఫీసర్- 20
ఛార్టర్డ్ అకౌంటెంట్- 50

దరఖాస్తు ప్రారంభం- 2020 అక్టోబర్ 27
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 నవంబర్ 17
అడ్మిట్ కార్డ్ రిలీజ్- త్వరలో వెల్లడించనున్న యూకో బ్యాంక్
ఆన్‌లైన్ ఎగ్జామ్- 2020 డిసెంబర్ లేదా 2021 జనవరి
పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.