Breaking News

వచ్చే మూడు నెలలు నిర్ణయాత్మకంగా


 కొవిడ్‌ పరిస్థితిని నిర్ణయించడంలో వచ్చే మూడు నెలలు నిర్ణయాత్మకంగా ఉండబోతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ అన్నారు. రాబోయే పండుగలు, శీతాకాలం నేపథ్యంలో ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరారు. యూపీ అధికారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మరణాల రేటు తక్కువగా ఉండేందుకు పరీక్ష, నిఘా, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, ముందస్తు రోగ నిర్ధారణపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. యూపీ వంటి పెద్ద రాష్ట్రంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడం, ఇతర జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమన్నారు.