Breaking News

ప్రభుత్వంపై కోర్టులకు వెళ్లి...


 ఏపీ ప్రభుత్వంపై కోర్టులకు వెళ్లి, టీడీపీ నేతలను హోటళ్లలో కలుస్తున్న రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ ప్రసాద్‌పై విశ్వాసం లేకే తాము ఎస్ఈసీ నిర్వహించిన సమావేశానికి వెళ్లలేదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మ౦త్రి బొత్స సత్యన్నారాయణ వెల్లడించారు. పార్టీ విధానం, ప్రభుత్వ విధానం ఒక్కటే అని తెలిపిన మంత్రి.. ఎస్ఈసీ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించామని తెలిపారు.

స్ధానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ సిద్దమేనని…నూటికి నూరుశాతం తమదే గెలుపు అని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్త౦ చేశారు. రాష్ట్రంలో ఇంకా కోవిడ్ తీవ్రత ఉన్నందువల్లే ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. ఓ వ్యక్తి నిర్ణయం వల్ల రాష్ట్రానికి రూ. 3,200 కోట్లు నష్టం వచ్చి౦దని.. అప్పుడు రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా నాడు ఎన్నికలు ఎలా రద్దు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ అడిగారు.