Breaking News

తెలంగాణ, ఎపి పరిస్థితులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఆరాభారీ వర్షపాతం కారణంగా తెలంగాణ, ఎపి పరిస్థితులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే మరిన్ని సహాయక చర్యలు చేపట్టాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోదీ సూచించారు. రెస్క్యూ & రిలీఫ్ వర్క్ లో కేంద్రం నుండి సాధ్యమయ్యే అన్నివిధాల మద్దతు ఉంటుందన్న ప్రధాని.. అవసరమైన సహాయానికి హామీ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు.