Breaking News

తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు వచ్చేశాయి..


 తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-TS EDCET 2020 ఫలితాలు విడుదలయ్యాయి. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఎడ్‌సెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఎడ్‌సెట్ ఎగ్జామ్‌లో 97.58 మంది విద్యార్థులు అర్హత సాధించడం విశేషం. అమ్మాయిలు 76.07 శాతం పాసయ్యారు. ఫలితాలను https://edcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేయొచ్చు. తెలంగాణలో 206 బీఈడీ కాలేజీల్లో 18 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. క్వాలిఫై అయిన అభ్యర్థులకు త్వరలో కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ షెడ్యూల్ నవంబర్ మొదటి వారంలో విడుదల కానుంది. మరి తెలంగాణ ఎడ్‌సెట్ రిజల్ట్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.