Breaking News

శీతల పానీయాలు వల్ల కలిగే అనర్ధాలేంటో తెలుసా..?



కూల్‌ డ్రింక్స్‌ తాగని వారు అరుదుగా ఉంటారు. సరదగా బయటకు వెళ్లినా.. ఇంట్లోకి బంధువులు వచ్చినా.. చాలామంది కూల్‌ డ్రింక్స్‌ తప్పనిసరిగా తాగుతుంటారు. తియ్యతియ్యగా.. చల్లచల్లగా.. ఉండే ఈ శీతల పానీయాలు ఆరోగ్యానికి మంచిది కాదు. వీటి వల్ల కలిగే అనర్ధాలేంటో తెలుసా..?

- కూల్‌ డ్రింక్స్‌ లో స్వీట్‌ సోడా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రుచి కోసమే ఎక్కువ మంది శీతల పానీయాలు తాగుతుంటారు. వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోగా ఆరోగ్యానికి హాని చేస్తాయి.

- మీరు తాగే కూల్‌ డ్రింక్స్‌ లో అత్యధిక స్థాయిలో చక్కెర ఉంటుంది. ఇది శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

- ఓ అధ్యయనం ప్రకారం కూల్‌ డ్రింక్స్‌ తాగిన వారిలో ఒబెసిటీ (ఊబకాయం) సమస్యలు పెరుగుతాయి. - కూల్‌ డ్రింక్స్‌ ఎప్పుడో ఒకసారి తాగితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ తరచూ తాగితే గుండె సంబంధ వ్యాధులు కూడా వస్తాయి.

- శీతల పానీయాలతో ఎసిడిటీతో పాటు జీర్ణ సంబంధ సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలతో ఇబ్బంది పడతారు.

- కూల్‌ డ్రింక్స్‌ ఎక్కువ తాగే వారిపై సర్వే చేయగా.. వారిలో ఎక్కువ మంది అనారోగ్య సమస్యలకు గురయినట్లు అధ్యయనంలో తేలింది. అందుకే కూల్‌ డ్రింక్స్‌ కు దూరంగా ఉండడం మంచింది.