Breaking News

వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఫొటోస్ వైరల్ఊరు బయట ఎవరో పోట్లాడుకుంటే..ఊళ్లో పెద్ద మనుషుల జాతకాలు బయటకు వస్తాయని సామెత. ఏపీ రాజకీయాల్లో ఈ సామెత కొద్దిగా అటూఇటూగా నిజం అవుతోంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు చెందిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని వైసీపీ సోషల్ మీడియా విభాగం వెలుగులోకి తెచ్చివైరల్ చేస్తోంది. ఆ ఫోటోలో ఏం ఉందంటే..ఓ రష్యన్ మోడల్..రఘురామకృష్ణరాజు నోట్లో వయ్యారంగా షాంపేన్ పోస్తోంది. ఆ షాంపెన్‌ను ఆయన అబగా తాగుతున్నారు. ఆ ఫోటో పెట్టి.. ఆయనను రకరకాలుగా వర్ణిస్తూ..వైసీసీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.దానికి రఘురామకృష్ణరాజు కౌంటర్ కూడా ఇచ్చారు.


ఆ ఫోటోలో ఉన్నది తానేనని… రష్యన్ అమ్మాయి తన నోట్లో షాంపెన్ పోసిందని..తాను తాగానని..అయితే ఏంటని ప్రశ్నించారు. తాను మంచి క్వాలిటీ షాంపెనే తాగానని..ప్రెసిడెన్షియల్ మెడల్ కాదని సెటైర్ కూడా వేశారు. తాను ఎంపీగా గెలవడాని ముందు అంటే మూడేళ్ల కిందట ఓ ఎంపీ ఇచ్చిన పార్టీ అదని చెప్పుకొచ్చారు. అందులో తాను మాత్రమే కాదు.. ఇంకా చాలా మంది ఉన్నారన్నారు. నిజానికి రాజకీయ నేతల పార్టీల్లో ఇలాంటి హంగూ ఆర్భాటాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. రష్యన్ మోడల్స్‌తో తానా తందానాలు పెట్టి ఇలా బాటిల్స్ పట్టుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నోట్లో పోసే లగ్జరీస్ కూడా ఏర్పాట్లు చేస్తారు.


ఈ పార్టీలకు అన్ని పార్టీల నేతలూ హాజరవుతారు. కానీ ఎంజాయ్ మెంట్ వేరు..రాజకీయం వేరు అనుకుని.. ఈ విషయాలను ఎక్కడా బయట పెట్టుకోరు. కానీ వైసీపీ నేతలు మాత్రం రఘురామకృష్ణరాజును టార్గెట్ చేసుకుని ఆయన ఫోటోలు బయట పెట్టారు. రేపు ఇంకొకరు.. ఇతరుల ఫోటోలు బయట పెడతారు. అప్పుడు… రాజకీయ నేతల పార్టీల లోగుట్టు అంతా బయటకు వస్తుంది. ఏ రాజకీయ నేత ఎలా జల్సాలు చేశారో స్పష్టమవుతుంది.