Breaking News

తీరొక్క దసరా గ్రేటర్‌లో


 విజయ దశమి... చెడుపై విజయం సాధించినందుకు చిహ్నంగా జరుపుకుంటాం. ఆశ్వయుజ మాసంలో పాడ్యమి నుంచి దశమి వరకు తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. రోజుకొక ప్రత్యేక అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. సృష్టి, స్థితి, లయ అనే మూడు ధర్మాలు ప్రారంభమైన కాలంగా నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటారని ప్రతీతి. తొమ్మిదికి చాలా ప్రాధాన్యత ఉంది. మానవ దేహంలో రంధ్రాలు తొమ్మిది... సప్తశతిలో అమ్మవారు సంహరించిన రాక్షసుల సంఖ్య తొమ్మిది... నవధాన్యాలు తొమ్మిది...అలా నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారని శాస్త్రం చెబుతోంది. అయితే నవరాత్రి ఉత్సవాలను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన సంప్రదాయ రీతిలో నిర్వహిస్తారు. సకల సంస్కృతుల సమ్మేళనంగా నిలుస్తోన్న భాగ్యనగరంలో ఆయా ప్రాంతవాసుల పండుగ శైలి విభిన్న శైలిలో కనిపిస్తోంది. ఆ సంస్కృతుల సమాహారం మీ కోసం.