Breaking News

టాయిలెట్‌లో శవమై తేలాడు

 


 14 రోజుల పాటు కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి ఆసుపత్రి టాయిలెట్‌లో శవమై తేలాడు. ఈ సంఘటన మహారాష్ట్ర లోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సూర్యభన్‌ యాదవ్‌ అనే 27 ఏళ్ల వ్యక్తి టీబీతో బాధపడుతున్నాడు. దానికి తోడు కరోనా కూడా సోకడంతో కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరాడు. అక్టోబర్‌ 3వ తేదీన టాయిలెట్‌లోకి వెళ్లి, ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో అక్కడే ప్రాణాలు విడిచాడు.