Breaking News

అందుకే నా పంచ్ లు క్లిక్ అవలేదు:.హైపర్ ఆది


 హైపర్ ఆది.. బుల్లితెర మంచి స్టార్ నటుడు అయ్యాడు. కానీ, సినిమాల్లోకి వచ్చేసరికి తేలిపోయాడు. హిట్ హాస్యనటుడు అనిపించుకోలేకపోయాడు. తను సినిమాల్లో పెద్దగా క్లిక్ అవ్వలేకపోవడానికి కారణం చెప్పుకొచ్చాడు ఆది.

"టీవీల్లో స్కిట్స్ అన్నీ నావే. పంచ్ లు నేనే వేస్తాను. మిగతా క్యారెక్టర్లను డామినేట్ చేస్తాను. కానీ సినిమా వచ్చేసరికి అలా వర్కవుట్ కాదు. నా పంచ్ లు కొన్నే ఉంటాయి. నా ట్రాక్ చాలా చిన్నదైపోతుంది," తను సినిమాల్లో ఎందుకు క్లిక్ అవ్వలేకపోతున్నాడో చెప్పుకొచ్చాడు హైపర్ ఆది.

"అయినప్పటికీ 'తొలిప్రేమ', 'మేడమీద అబ్బాయి' లాంటి సినిమాల్లో నా ట్రాక్స్ బాగానే పండాయి," అని కూడా అంటున్నాడు.