Breaking News

యాడ్ షూట్ లో బిజీ గా ఉన్న హీరో నితిన్



యంగ్‌ హీరో నితిన్‌.. వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. కరోనా లాక్‌డౌన్ అనంతరం ఏర్పటిన అన్‌ లాక్‌లో భాగంగా షూటింగ్స్‌కు అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు షూటింగ్స్ మొదలవుతాయా అని ఎదురు చూసిన నితిన్‌.. అనుమతి రాగానే షూటింగ్‌ స్టార్ట్ చేశారు‌. ఇప్పటికే ఆయన 'రంగ్‌దే' షూటింగ్‌ను దాదాపు పూర్తి చేసేశారు. ఇటీవలే చంద్రశేఖర్‌ యేలేటితో చేస్తున్న 'చెక్‌' చిత్రం అలాగే అంధాధూన్‌ రీమేక్‌ చిత్రాల అప్‌డేట్స్‌ కూడా ఆయన ప్రకటించారు. ఇలా వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్న నితిన్‌ ఇప్పుడొక యాడ్‌ షూట్‌లో కూడా పాల్గొన్నారు. ఈ యాడ్‌ దేని కోసం అనేది తెలియలేదు కానీ.. ఈ యాడ్‌లో ఆయన లుక్స్‌ మాత్రం చాలా ప్రామిసింగ్‌గా ఉన్నాయి. నెటిజన్లు కూడా లుక్‌ అదరింది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారంటే.. నితిన్‌ ఎలా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.