Breaking News

ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి

 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. నాసా వ్యోమగామి క్రిస్ కాసిడీ, రష్యన్ వ్యోమగాములు ఇవాన్ వాగ్నెర్, అనాటోలీ ఇవానిషిన్ గురువారం భూమిపైకి చేరారు. వీరు 196 రోజుల పాటు అంతరిక్షంలో సేవలందించారు. ముగ్గురూ బుధవారం రాత్రి 7:32 గంటలకు స్టేషన్ నుంచి బయలుదేరి కజకిస్తాన్లోని డెజ్కాజ్గాన్ పట్టణానికి దక్షిణాన రాత్రి 10:54 గంటలకు చేరుకున్నారు. వీరికి ల్యాండింగ్ సైట్ వద్ద ప్రాథమిక వైద్య తనిఖీలు నిర్వహించిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. క్రిస్‌ కాసిడీ నాసా విమానంలో హ్యూస్టన్‌కు.. వాగ్నెర్, ఇవానిషిన్ రష్యాలోని స్టార్ సిటీకి వెళ్తారు.