Breaking News

ఢిల్లీలో టీఆర్ఎస్‌ పార్టీ ఆఫీసుకు ఏర్పాటుకి రంగం సిద్దం

 


ఢిల్లీలో టీఆర్ఎస్‌ పార్టీ ఆఫీసుకు స్థలం కేటాయించింది కేంద్ర ప్రభుత్వం... ఢిల్లీలోని వసంత్ విహార్‌లో 1,100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది... ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావుకు లేఖ రాసింది పట్టణవ్యవహారాల మంత్రిత్వశాఖ. దీంతో, త్వరలోనే టీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్. వెంటనే శంకుస్థాపన చేసి.. వేగంగా నిర్మాణ పనులు పూర్తి చేయాలనే ప్లాన్‌లో ఉంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి.. ఆ తర్వాత రాజకీయ పార్టీగా మారింది టీఆర్ఎస్.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు.. రెండోసారి అధికారంలోకి వచ్చింది.. ఇక, ఢిల్లీలో కార్యాలయ నిర్మాణంతో ఆ పార్టీ కార్యకలాపాలకు మరింత వెసులుబాటు కలగనుంది.