Breaking News

కొత్త లుక్‌లో సంజయ్‌ దత్


 నయా (కొత్త) లుక్‌లో సంజయ్‌ దత్‌ తన అభిమానులకు స్వీట్‌ షాక్‌ ఇచ్చారు. ఆయనకు క్యాన్సర్‌ అని నిర్ధారణ కాగానే అభిమానులు చాలా బాధపడ్డారు. ’మా సంజూ బాబాకి ఏం కాదు.. త్వరలోనే క్యాన్సర్‌ని జయిస్తారు’ అని అభిమానులు పేర్కొన్నారు. అన్నట్లుగానే సంజయ్‌ దత్‌ త్వరగా ఈ మహమ్మారి నుంచి బయటపడ్డారు. ’నేను క్యాన్సర్‌ని జయించాను’ అని అధికారికంగా చెప్పి, అందర్నీ ఆనందపరిచారు సంజయ్‌ దత్‌. తాజాగా నయా లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ముంబైలోని ప్రముఖ హెయిర్‌ స్టయిలిస్ట్‌ ఆలిమ్‌ హకీమ్‌ సెలూన్‌కి వెళ్లి, కొత్త హెయిర్‌ స్టయిల్‌ చేయించుకున్నారు సంజయ్‌ దత్‌. ఆ ఫొటోను హకీమ్‌ షేర్‌ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం హిందీలో షంషేరా, పృథ్వీరాజ్‌ చిత్రాలు చేస్తున్నారు సంజయ్‌ దత్‌. అలాగే ‘కేజీఎఫ్‌’కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘కేజీఎఫ్‌ 2’లో నటిస్తున్నారు.